ఆశపోతు | Moral Stories in Telugu

 ఒక ఊళ్ళో రాముడనే వాడుండేవాడు-


వాడు చాలా పేదవాడు-


ఒకనాడు వాడు అడవికి వెళ్ళి అక్కడ కొలనులో ఉన్న ఒక బాతును పట్టుకున్నాడు


దాన్ని వండుకు తినటానికి ప్రయత్నించగా అది మానవ భాషలో ఇలా చెప్పింది.


“రాముడూ... నన్ను చంపకు నేను నీ అదృష్టదేవతని. నన్ను నీవు చంపకుండా ఉంటే నేను రోజుకొక బంగారు గుడ్డును పెడతాను. దాన్ని నువ్వు అమ్ముకుంటే బోలెడంత ధనం వస్తుంది" అన్నది.


ఆ మాట విన్న రాముడు, అతని భార్య చర్చించుకుని 'సరే! ఈ నాటికి దీన్ని చంపకుండా ఉంచుదాం. ఇది చెప్పినట్లే రేపు బంగారు గుడ్డు పెట్టిందా సరేసరి లేకపోతే అప్పుడే దీన్ని చంపుకుతిందాం' అనుకున్నారు –


ఆ బాతు చెప్పినట్లే మర్నాడు బంగారు గుడ్డు పెట్టింది - ఆ గుడ్డును అమ్ముకుంటే బోలెడంత ధనం వచ్చింది-


ఆనాటి నుండి ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు పెట్టసాగింది. దాన్ని అమ్ముకుంటూ తొందర్లోనే రాముడు మంచి స్థితిమంతుడయ్యాడు. కొంత కాలం అయిన తర్వాత రాముడికి ఒక ఆలోచన వచ్చింది. రోజు ఈ బాతు ఒక్క గుడ్డు పెట్టడం దాన్ని తను తీసుకుపోయి అమ్ముకోవటం అనవసరమైన చాకిరీ. అసలు ఈ బాతు పొట్ట కోసి అందులో ఉన్న గుడ్డులన్నీ తీసుకుపోయి ఒక్కసారిగా అమ్ముకుంటే తను మరింత ధనవంతుడు కావచ్చు కదా అన్నదే వాడి ఆలోచన -


ఆ రాత్రే బాతు పొట్టను కోసాడు-


ఒక్క బంగారు గుడ్డు లేదు-


అప్పుడు తెలిసింది వాడికి తన తప్పు-


అయ్యో ఆశపోతునయ్యి బంగారు గుడ్లు పెట్టే బాతు పొట్టకోసానే అని ఎంతగానో దుఃఖించాడు.


అతిగా ఆశపడే వాడికి ఎప్పటికైనా ఇలాంటి భంగపాటు తప్పదు. రోజుకొక్క బంగారు గుడ్డు బ్రతికినంతకాలం పెట్టే ఆ బాతును తన అత్యాశ వలన చేజేతులారా రాముడు చంపుకుని తప్పు చేసినట్లే ఆత్యాశ తప్పు చేయిస్తుంది.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్