వనదేవత | Moral Stories in Telugu

 ఒక ఊరిలో ఇద్దరు అన్నాతమ్ముళ్ళు ఉండేవారు ఇద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకు వచ్చి ఊరిలో అమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉండేవారుఒకనాడు ఇద్దరూ అడవికి వెళ్ళారు - ఎంత వెతికినా ఎండిపోయిన చెట్టు ఒక్కటీ వాళ్ళకి కన్పించలేదుమధ్యాహ్నం వేళ వరకు గాలించి పెద్దవాడు ఒక చెట్టు నీడన నిద్ర పోయాడు. చిన్నవాడు మాత్రం పట్టువీడకుండా మరికొంత దూరం వెళ్ళాడు


వాడి శ్రమ ఫలించింది- ఒక కొలను ఒడ్డున ఎండిపోయిన చెట్టు కన్పించిందివాడు ఆనందంగా ఆ చెట్టు పైకి ఎక్కి కొమ్మను నరికే ప్రయత్నంలో

పడ్డాడు


ఎండు కొమ్మ గొడ్డలి దెబ్బకు ఎదురు తిరుగుతోందిపట్టు వదలకుండా దెబ్బ మీద దెబ్బ వేస్తుంటే వాడి చెయ్యి పట్టు


తప్పింది. గొడ్డలి ఎగిరి కొలను మధ్యలో పడిపోయింది-


అయ్యో! నా అజాగ్రత్త వల్ల పనిముట్టు పోయిందే నా కుటుంబాన్ని పోషించుకోవటానికి అదే కదా ఆధారం. మళ్ళీ ఇంకో గొడ్డలి కొనుక్కునే స్థోమత కూడా నాకు లేదు కదా... ఎలా? నా కుటుంబం, నేనూ పస్తులతో మాడి చావవల్సిందే కదా అంటూ దుఃఖించసాగాడు -


ఆ సమయంలో-

,

ఆ వనదేవత అక్కడకి దగ్గర్లో ఉన్న పొదల్లో కుందేళ్ళతో ముచ్చట్లు ఆడుతోంది. ఆమెకి ఆ దుఃఖం విన్పించి వచ్చింది-


ఏడుస్తున్న చిన్న వాడ్ని 'ఎందుకేడుస్తున్నావు?' అంటూ అడిగింది – జరిగింది చెప్పాడు- 'బాధపడకు నీ గొడ్డలిని నేను తీసి ఇస్తాను' అన్నదామె- “నువ్వెవరు?” “నేను ఈ వనదేవతను” వాడికి ఆనందం కల్గింది - ఆమె ఓ మంత్రం చదివింది- కొలనులోంచి ఓ బంగారు గొడ్డలి పుట్టుకొచ్చి ఒడ్డుకు చేరింది'ఇదేనా? నీ గొడ్డలి' అంది - “కాదు” “కాకపోతే పోనీ ఇది బంగారు గొడ్డలి 'తీసుకు వెళ్ళు' దీనిని


అమ్ముకుంటే చాలా ధనం వస్తుంది. దానితో బ్రతికినంత కాలం సుఖంగా జీవించవచ్చు” అన్నది.


“వద్దు... నాది కానిది నాకు వద్దు. పాపం ఈ బంగారు గొడ్డలిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు ఎంత బాధపడుతున్నాడో నీకు చేతనయితే దీనిని అతని దగ్గరకు చేర్చు” అన్నాడు.


వాడి నిజాయితికి వనదేవత సంతోషించింది. అయినా మరొకసారి పరీక్షిద్దామనుకుని రెండొవ సారి వెండి గొడ్డలి, మూడొవసారి రాగి గొడ్డలిని సృష్టించింది


ఆ రెండూ కూడా తనవి కాదన్నాడువాడు-


ఆఖరుగా వాడి ఇనుప గొడ్డలిని కొలను నుండి బయటకు తీసి ఇస్తూ “నీవు సత్యవంతుడివి.


అందుకనే ఈ మిగిలిన గొడ్డళ్ళను కూడా నీకే ఇస్తున్నాను. వీటిని తీసుకుపోయి సుఖంగా జీవించు" అంది


ఆ మూడు గొడ్డళ్ళను అమ్ముకుని వాడు ధనవంతుడయ్యాడుతమ్ముడు ధనవంతుడు కావటం చూసిన అన్నయ్య అతనికి అదృష్టం ఎలా కలిసి వచ్చిందో కూపీ లాగాడు-


అమాయకుడైన ఆ తమ్ముడు జరిగిన సంగతి అంతా అన్నయ్యకు పూస గుచ్చినట్లుగా వివరించాడు-


అది విన్నాక అతనికి దుర్బుద్ధి పుట్టింది-


కల్గింది తమ్ముడి కంటే తాను మరింత ధనవంతుడు కావాలన్న ఆలోచన


మర్నాడు రెండు గొడ్డళ్ళు తీసుకుని అడవికి వెళ్ళాడు- చేరాడు - తమ్ముడు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంతో కష్టపడి ఆ కొలను ఒడ్డుకు


తమ్ముడు ఎక్కిన ఎండు చెట్టు మీదకే ఎక్కి కొమ్మను నరుకుతున్నట్లుగా నటిస్తూ ఒక గొడ్డలిని కొలనులోకి పడేసాడు. ఆ తర్వాత రెండో గొడ్డలిని కూడా కొలనులోకి విసిరేసి ఆపై పెద్దగా ఏడ్వసాగాడు – కొంత సేపటికి ఆ ఏడ్పు విని వనదేవత ప్రత్యక్షమయ్యింది -


“ఎవరు నాయనా?" అంటూ అడిగింది -


ఆమె వనదేవత అని గ్రహించుకున్న అతడు రెండు చేతుల్తో నమస్కరించి తన గురించి చెప్పి తన రెండు గొడ్డళ్ళు కొలనులో పడిపోయిన విషయం ఆమెకి చెప్పాడు-


వనదేవతకు అతని దుర్భుద్ధి అర్థమైపోయింది-


అడవిలో నిజంగా కట్టెలు కొట్టుకుంటానికి వచ్చినవాడైతే ఒక గొడ్డలితో వస్తాడు. అది పడి పోయినాక రెండవది పోకుండా జాగ్రత్త పడతాడు. కానీ ఒక్క ఎండు పుల్లనయినా నరకకుండా రెండు గొడ్డళ్ళని పోగొట్టుకున్నాడంటే ఇదంతా కావాలని ఆడుతున్న నాటకం వీడికి తగిన బుద్ధి చెప్పి తీరాలి అనుకుంది-


చిరునవ్వుతో అతనికి ధైర్యం చెప్పి “బాధపడకు నాయనా! నీ గొడ్డళ్ళని నేను బయటకు తెప్పిస్తాను.” అంటూ ముందుగా రెండు బంగారు గొడ్డళ్ళని కొలనులో నుండి బయటకు తెప్పించి “నీవేనా?” అంటూ అడిగింది -

పెద్దవాడు తన తమ్ముడు చెప్పినట్లే కాదు అన్నాడు రెండవసారి వెండి గొడ్డళ్ళను, మూడవసారి రాగి గొడ్డళ్ళను కొలనులో నుండి బయటకు తెప్పించింది వన దేవత-


అవి తనవి కాదన్నాడు -


ఆఖరుగా ఇనుప గొడ్డళ్ళను బయటకు రప్పించిందివెళ్ళు” అంటూ మాయమైపోయింది వనదేవత-


వాడు ఆనందం నటిస్తూ ఆ రెండు గొడ్డళ్ళే తనవే అంటూ చెప్పాడు“మంచిది నాయనా! నీ గొడ్డళ్ళు నీకు దొరికాయిగా ఇక ఇంటికి


నిర్ఘాంతపోయాడు వాడు-


తమ్ముడు చెప్పినట్లే సమాధానాలు చెబితే వనదేవత అతడికి లాగే తనకి కూడా ఒకటికి రెండు బంగారు, వెండి, రాగి గొడ్డళ్ళను ఇస్తుందనుకున్నాడు. కానీ ఆమె ఇవ్వకుండా మాయంకావటంతో ఉస్సూరుమన్నాడు-


అదృశ్యరూపంలో వనదేవత అతడికి ఇలా చెప్పింది -


“దురాశ దుఖానికి చేటు... నీవు ఒక్క గొడ్డలి పోయినపుడే ఏడ్పు నటించి ఉన్నట్లు ఉంటే నీ తమ్ముడుకు దక్కినట్లే నీకు కూడా బంగారు, వెండి, రాగి గొడ్డళ్ళు నీ గొడ్డళ్ళతోపాటు దక్కి ఉండేవి. కానీ నీవు దురాశకు పోయి రెండో గొడ్డలిని కూడా కొలనులోకి విసిరేసి నీ అదృష్టాన్ని చేజార్చుకున్నావు.


ఆ మాటలు విన్న అతడు "అయ్యో! నా దురాశ ఎంత చేటు తెచ్చింది” అంటూ దుఃఖించాడు.


దురాశ వల్ల మనిషి ఎన్నటికీ బాగుపడలేడు. తృప్తి లేని జీవితము నరక ప్రాయము అవుతుంది.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్