బొందితో స్వర్గం | Moral Stories in Telugu

 గంగాతీరంలో ఒక పెద్ద అడవి ఉండేది-


ఆ అడవికి చారుదత్తుడనే సింహం రాజుగా ఉండేది- ఆ అడవిలోనే సర్వోత్తముడు అనే మరొక ముసలి సింహం ఉండేది. మునుపు ఆ అడవికి అదే రాజు -


సర్వోత్తముడి దగ్గర మంత్రిగా పని చేసిన పైలముడనే నక్కే చారుదత్తుడి దగ్గర మంత్రిగా పనిచేస్తోంది. దానికి సర్వోత్తముడంటే అసూయ. అందుకు కారణం సర్వోత్తముడు మంచి తిండిపుష్టి కలవాడు. అందుచేత ఏ జంతువును వేటాడినా మాంసమంతా శుభ్రంగా తినేసేవాడు. ఎముకల్లో, మూలుగుల్లో మిగిలిన గుజ్జును జుర్రుకోవటానికి పైలముడికి వదిలేసేవాడు-


ఒకనాడు చారుదత్తుడు ఏకాంతంగా ఉండగా కలుసుకున్నాడు. పైలముడు.


అప్పటికి రెండు రోజుల ముందు నుండి కావాలనే అతడు చారుదత్తుడికి ఎదురుపడకుండా తప్పించుకు తిరిగాడు-


"ఏం? పైలమా రెండు రోజుల్నుండి కన్పించలేదు ఎక్కడకు వెళ్ళావు?”


"క్షమించండి మహారాజా! అనుకోకుండా నేను గ్రామసందర్శనానికి వెళ్ళాను. అక్కడొక మహాత్ముడు పురాణశ్రవణం చేస్తుంటే ఒళ్ళు మరచి వింటూ అక్కడే ఈ రెండు రోజులు ఉండిపోయాను” అంటూ ఎంతో నమ్మకంగా చెప్పింది నక్క.


“ఆహా! అందులో మనకి ఉపయోగపడే విషయాలేమన్నా ఉన్నాయా?” అంటూ చారుదత్తుడు ప్రశ్నించే సరికి కావాలనే సమాధానం ఇవ్వకుండా నీళ్ళునములుతున్నట్లు నటించిందది.


“ఏం? పైలమా మాకు చెప్పకూడని విషయాలు విన్నావా?" “ఎంత మాట ప్రభూ.....” “మరింకేం చెప్పు.....” "చెబితే తమ ఆగ్రహానికి గురి కావల్సివస్తుందేమోనని.” "అభయమిస్తున్నాను... పర్వాలేదు చెప్పు” “బొందితో స్వర్గానికి వెళ్ళటానికి దారి తెలుసుకున్నాను ప్రభూ.....” “భేష్... పైలమా... భేష్... ఆ రహస్యాన్ని మాకు చెప్పటానికి ఎందుకు సంకోచించావు.”


“నేను చెబితే తమరు అపార్థం చేసుకుంటారని” “ఏం చేసుకోను చెప్పు”


“మహారాజా! మనిషి మాంసం రుచి చూస్తే చచ్చిపోయిన తరువాత స్వర్గానికి చేరుకుంటామట. అదే సింహం మాంసం రుచి చూస్తే బొందితోనే స్వర్గానికి చేరుకుంటామట.”


పైలముడి మాటలు వింటూనే “పైలమా!” అంటూ సింహం పెద్దగా కోపంతో గాండ్రించింది.


ఆ గాండ్రింపుకి నక్కకు కాళ్ళూ, చేతులూ వణికాయి-


వెంటనే


"మహారాజా! ఆగ్రహించకండి. నా ఉద్దేశం మీ మాంసం నేను రుచి చూడాలనికాదు. నేను విన్న విషయాన్ని తమరు చెప్పమంటేనే చెప్పాను. ఇందుకే మహారాజా! నే చెప్పటానికి సందేహించింది” అంటూ రెండు చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చుని ఎంతో వినయం నటించింది ఆ నక్క.


దాని మాటలకు చారుదత్తుడు శాంతించాడు-


“పైలమా! క్షమించాను కానీ స్వజాతీయులను చంపుకుని తినుట ఎవ్వరికీ సాధ్యంకాదు.”


"అదేమిటి మహారాజా! సర్పజాతి తమ సంతతిని తామే తింటాయంటారు. వ్యాఘ్రజాతిలో కూడా ఆ ఆచారం ఉందని విన్నట్లు గుర్తు” అంటూ పైలముడు చారుదత్తుడిని తన ఆలోచన వైపు మళ్ళించి అతడితో సర్వోత్తముడిని చంపించి ఆపై ఆ మాంసాన్ని తను తినాలన్నా కోరికతో వాదన పెంచాడు.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్