'నువ్వు చెప్పేది నిజమయినా ఇది సాధ్యం కాదు' అంటూ కొట్టిపారేసాడు చారుదత్తుడు. “ఎందుకు కాదు ఎటూ పనికిమాలిన సర్వోత్తముడున్నాడు కదా! అతడు రాజుగా చేసిన అకృత్యాలకు నేనే సాక్షి. అటువంటి వాడిని చంపటం వల్ల పాపం కూడా అంటదు. ఏది ఏమైనా, తమవంటి ఉత్తములు బొందితో స్వర్గానికి వెడితే ఆ స్వర్గానికే రాజవుతారు” అంటూ చారుదత్తుడిని ఊరించాడు పైలముడు-
“సరే! చుద్దాంలే”
“చుద్దాంలే కాదు మహారాజా! రేపే పున్నమి. ఆ రోజున సింహం మాంసం తింటే మరింత విశేషమని ఆ ముని చెప్పాడు.” “సరే! రేపే ఆ సర్వోత్తముడిని చంపుతాను” అన్నాడు చారుదత్తుడు -
ఈ విషయం చాటు నుంచి ఒక కుందేలు వింది. అది వెళ్ళి సర్వోత్తముడి చెవిన వేసింది. ముందు ఆవేశపడినా ఆ తర్వాత శాంతంగా ఆలోచించి ఇదంతా చారుదత్తుడితో తనని చంపించటానికి పైలముడు వేసిన ఎత్తు అని గ్రహించి వెంటనే వెళ్ళి ఆ విషయం చారుదత్తుడికి అర్థమయ్యేట్లు వివరించింది. అంతా విన్న చారుదత్తుడు పైలముడికి తగిన గుణపాఠం చెబుతానని సర్వోత్తముడికి మాట ఇచ్చాడు -
మర్నాడు పైలముడు చారుదత్తుడి దగ్గరకు వెళ్ళి “పదండి మహారాజా ఆ సర్వోత్తముడి పని పడదాం” అనగానే చారుదత్తడు ఒళ్ళు విరుచుకున్నాడు. “పైలమా రాత్రి నేను ఆ ముని దగ్గరకు వెళ్ళి బొందితో స్వర్గానికి వెళ్ళటానికి సింహం మాంసం తినాలా? అనడిగాను. నువ్వు పొరపాటుగా విన్నట్టున్నావు. సింహం మాంసం కాదంట. నక్క మాంసమట" అంటూనే పంజాతో నక్క నడుం మీద కొట్టింది. దెబ్బకి కీచుగా అరుస్తూ నక్క ప్రాణాలు వదిలింది.
ఇతరులకు హాని చెయ్యాలని ప్రయత్నించేవారు ఎవరైనా చివరికి తాము తీసుకున్న గోతిలో ఈ నక్కలా తామే పడతారు.
ఒక రాజుగారి తోటలో ఒక కాకి ఉండేది. అది గొప్ప బడాయి కాకి. తను రాజుగారి తోటలో ఉంటున్నాననే గర్వంతో అది మిగతా కాకులపట్ల చులకనగా ప్రవర్తించేది.
ఒకనాటి రాత్రివేళ ఆ తోటలోకి ఒక కోకిల వచ్చి వాలింది. దాన్ని చూడగానే కాకికి ఎక్కడ లేని కోపం ముంచుకు వచ్చి కోకిలతో ఇలా అంది-
"ఏయ్! కోకిల ఎక్కడ్నుంచి వచ్చావో మర్యాదగా అక్కడకే వెళ్ళిపో. ఇది రాజుగారి తోట ఇక్కడ నీలాంటి వాళ్ళకు స్థానం లేదు.”
కాకి మాటలకు కోకిలకి కోపం వచ్చింది-
"ఏంటి? పెద్ద బడాయి పోతున్నావు. ఇది రాజుగారి తోటని నాకు తెలుసు అయినా నువ్విక్కడ ఉండగా లేనిది నేనుంటే తప్పేంటి?" అంది కోకిల -
“నేను కాదు బడాయి పోతున్నది నువ్వే. నాతో నీకు పోటీనా? నేనిక్కడ ఎన్నో ఏళ్ళు నుండి ఉంటున్నాను. ప్రతిరోజు రాజు ఈ తోటలోకి వచ్చి నన్ను చూడందే రాచకార్యలు ఏవీ మొదలు పెట్టడు. పైగా రాజుగారి పితృదేవుళ్ళుగా భావించి ప్రతి రోజు నాకు ఓ అన్నపు ముద్ద పెట్టందే తను తినడు. అటువంటి నేనెక్కడ. నువ్వెక్కడ.
నేను రాజుతో ఒక్క మాట చెప్పానంటే రాజభటులు నిన్ను తరిమి, తరిమి కొడతారు. ఏ అంగవైకల్యం కలగక ముందే నువ్వు ఇక్కడ్నుంచి తుర్రుమనటం నీ ఒంటికే మంచిది" అంటూ కోకిలను హెచ్చరించింది కాకి -
ఆ మాటలు విన్న కోకిలకు మరింత ఒళ్ళు మండిపోయింది. అయినా తన మంటను బయట పడనీయకుండా ఇలా అంది-
సరే! మిత్రమా! నీవు నా మంచి కోరి చెబుతుంటే నేనెందుకు కాదంటాను. కానీ నా దొక చిన్న విన్నపము అంది-
కాకికి తగిన గుణపాఠం నేర్పటానికి అప్పటికప్పుడు కోకిల ఓ గొప్ప పథకాన్ని సిద్ధం చేసుకుంది. కాకి కనుక దాని బుట్టలో పడితే గర్వభంగం కలగటంతో పాటు ప్రాణాలకు కూడా ముప్పు కలగవచ్చు- “ఏమిటో చెప్పు” అంది కాకి దర్పంగా-
“ఏం లేదు మిత్రమా! నీవు ఎప్పుడూ ఇక్కడే ఉంటావు కదా. రాజుగారి ఆస్థానములో సంగీత విద్వాంసులు పాడే స్వరములను నీవు విని ఒంట పట్టించుకుని ఉండి ఉంటావు. నాకు నాలుగు స్వరములు నేర్పిస్తే ఆజన్మాంతం నీకు ఋణపడి ఉంటాను" అంది కోకిల.
కాకి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది -
తల్లక్రిందులుగా తపస్సు చేసినా దానికి సంగీతం ఒంట పట్టదు కదా! ఆ మాట కోకిలతో చెప్పటానికి దానికి అహం అడ్డు వచ్చింది"ఏం మిత్రమా! నా ఈ చిన్న కోరిక తీర్చవా?” అంటూ మళ్ళీ అడిగింది కోకిల -
"తీరుస్తాను కానీ ఇప్పటికిప్పుడంటే కాదు. సాయంత్రమే కాస్తంత మామిడి పిందెను కొరికాను. గొంతంతా అదోలా ఉంది. రేపు రాత్రివేళ వచ్చావంటే నీకు తప్పకుండా నాలుగు స్వరాలను నేర్పిస్తాను” అంది కాకి “అలాగే మిత్రమా!” అంటూ తుర్రుమని ఎగిరిపోయింది కోకిల అప్పటికి కోకిల ముందు తన పరువు పోకుండా తప్పించు కున్నందుకు బ్రతుకుజీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది ఆ కాకి- మర్నాడు ఉదయం రాజుగారి ఆస్థానంలో సంగీత విద్వాంసుల కచేరిని ఎంతో శ్రద్ధగా విని గమకా లను ఒంట పట్టించుకుని రాత్రి ఎప్పుడ వుతుందా? కోకిల ఎప్పుడు వస్తుందా? దాని ముందు సంగీతం పాడి తన గొప్ప తనం నిరూపించు కుందామా? అని ఎదురు చూడ సాగింది -
చీకటి పడిన కొంత సేపటికి కోకిల రానే వచ్చింది-
“వచ్చావా? నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నేను సంగీత స్వరాలు పాడుతాను విని నేర్చుకుని వెళ్ళిపో మళ్ళీ ఈ ఛాయలకు రాకు” అంటూ కాకి గొంతు విప్పబోయింది.
కోకిల “ఒక్క క్షణం మిత్రమా!” అంది -
"ఏంటి...? ఏమైంది?” అంది కాకి చిరాగ్గా-
మిత్రమా సాయంత్రమనగా ఇక్కడకు బయలుదేరాను. దారిలో అలుపు వచ్చి ఒక తోటలో వాలాను. ఆ తోటలో నీకులా సంగీతం నేర్చిన ఓ కాకి తారసపడి ఎక్కడకు వెడుతున్నావంటూ పలకరించింది. నీ దగ్గరకు అంటూ నేను సంగతంతా చెప్పాను. ఆ మాత్రం సంగీతం నేనూ నేర్పగలను నేర్చుకో అంటూ బలవంతంగా నాలుగు స్వరాలను నేర్పించింది. అవి
ఇప్పుడు నేను పాడుతాను నువ్వు విని అవి బాగున్నాయో లేదో కాస్తంత చెప్పు” అంటూ కోకిల మృదుమధురంగా ఆ సంగీత స్వరాలను పాడింది-
ఆ స్వరాలు ఏకాంత మందిరంలో ఉన్న రాజు రాణి విన్నారు కాకిని కూడా ఆ సంగీతం మైమరపించింది.
వెంటనే కావ్... కావ్... మంటూ తనూ ఆ స్వరాలను పాడటం ప్రారంభించింది-
అది తప్పుగా పాడటంతో 'అలా కాదు ఇలా' అంటూ మధ్యలో కోకిల అందుకుని పాడసాగింది-
కోకిల మృదుమధుర స్వరాలు వింటూ మైమరచి పోతున్న రాజు, రాణికి మధ్యలో కాకి అరుపులు చిరాకు కల్గించాయి -
అలా కోయిల కాకి పాడుతుంటే కావాలనే మధ్య మధ్యలో తను పాడుతూ కొంత సేపు గడిపింది-
కోకిల పాటకు మధ్యలో కాకి అడ్డుతగిలి కోకిలను అనుకరించాలని ప్రయత్నించటంతో రాజు, రాణికి చిరాకుతో పాటు కోపం ముంచుకొచ్చింది-
"ప్రభూ... ఈ వెధవ కాకి కోకిల సంగీతాన్ని విననివ్వకుండా
చేస్తోంది. ముందు దాన్ని పీక నులిమి చంపమని చెప్పండి” అంది కోపంగా- వెంటనే రాజు భటులను పిలిచి "భటులారా! రాణిగారు కోకిల సంగీతాన్ని వింటుంటే ఆ కాకి మధ్యలో కాకిగోల చేస్తోంది. దాన్ని చంపి తెచ్చిన వారికి వెయ్యి బంగారు వరహాలను బహుమతిగా ఇస్తాను" అంటూ ప్రకటించాడు-
బంగారు వరహాలకు ఆశపడి భటులు కాకిని చంపటానికి తోటలోకి వెళ్ళి రాళ్ళతో దాన్ని కొట్టారు-
భటులరాకను ముందే గమనిం చిన కోయిల తుర్రుమంది
పాపం! చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఒంటి నిండా గాయాల పాలైన ఆ కాకి రాజుగారి తోటను విడిచి దూరంగా పారిపోయింది. మళ్ళీ ఎప్పుడు రాజుగారి తోటలో వాలే సాహసమే అది చెయ్యలేదు మరి-