పులి - దానం | Moral Stories in Telugu

 అనగనగా ఒక అడవి - ఆ అడవికి రాజు ఒక పెద్ద పులి - ఆ పులి వయసు మీదపడి ముసలిదైపోయింది- ఎంత ముసలిదైపోయిందంటే వేటాడటానికి కూడా ఓపిక లేనంతవేటాడలేక పస్తులతో ఉండలేక అది ఒక ఉపాయం పన్నింది కొంత కాలం క్రితం ఆ పులి ఒక వర్తకుడ్ని చంపింది. అతని మెడలో ఉన్న బంగారు గొలుసును తీసుకుపోయి తన గుహలో భద్రపరిచింది-


అది బాటసారులు నడిచే బాట వెంట ఒక చెట్టు దగ్గర కూర్చుంది. దానికి ప్రక్కనే ఒక కొలను కూడా ఉంది.


వచ్చే పోయే బాటసారుల కోసం కాచుక్కూర్చుందికొంతసేపటికి


ఒక యువకుడు ఆ బాట వెంట వచ్చాడు-


అతడు తెలివి తేటలు కలవాడు-


పులి ఆ యువకుడ్ని చూస్తూనే “ఓ బాటసారి... ఇటురా” అంటూ పిల్చింది -


పులి పిలుపు విని ఆ యువకుడి గుండె గుభేల్ మంది-


"భయపడకు నిన్నేంచేయను ఇటురా... నేను మరి కొద్ది రోజుల్లో మరణిస్తానని ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. మరణించాక స్వర్గానికి పోవాలనుకుంటే ఎవరన్నా బాటసారికి సువర్ణ దానం చెయ్యమన్నాడు.


అందుకే దయచేసి ఈ బంగారు గొలుసును నా నుంచి దానంగా స్వీకరించు” అంటూ బంగారు గొలుసును అతనికి చూపించింది-


పులి మాటలు విన్న ఆ యువకుడు సంశయంలో పడ్డాడుదాని మాటలు చూస్తే నమ్మకంగానే ఉన్నాయి-


కానీ -


పులివంటి కూరజంతువు ఇంత సాధు స్వభావంతో ప్రవర్తించటం


అతడికి అనుమానాన్ని కల్గిస్తోంది. అందుకని పులితో ఇలా చెప్పాడు -


“అయ్యా! తమరిచ్చేదానం స్వీకరించటానికి నేను యోగ్యుడ్ని కాదు. నాకు నిన్ననే బిడ్డపుట్టి చనిపోయాడు.


కనుక మా ఇంట సూతకం. ఇటువంటి సమయంలో మీరు నాకు దానం ఇస్తే మీ కోరిక నెరవేరదు.”


పులి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది -


ఆ యువకుడ్ని బలవంతం చేస్తే తన బండారం బయటపడుతుంది అనుకుని “అయ్యో! వెళ్ళిరా నాయనా" అంది.


పడ్డాడు ఆ యువకుడు బ్రతుకు జీవుడా అనుకుని అక్కడ్నుంచి బయట అపాయం ఎదురైనప్పుడు బుద్ధి బలం ఉపయోగించుకుంటే సమస్య నుండి బయటపడవచ్చు.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్