బుద్ధి బలం | Moral Stories in Telugu

 దేశసంచారం చేస్తూ ఒక మునీశ్వరుడు ఒక గ్రామం వచ్చాడుఆ ముని అమోఘమైన మంత్రశక్తి కలవాడు-


ఆ ఊరి వాళ్ళంతా ఆయన దర్శనం చేసుకుని వాళ్ళ, వాళ్ళ కష్టాలను చెప్పుకున్నారు. ఆయన వాళ్ళకష్టాలు తీరటానికి రక రకాల మంత్రాలను ఉపదేశించాడు-


ఆ ఊరిలో గోవిందుడనే వాడున్నాడు-


గోవిందుడు అమాయకుడు. అంతకంటే వెనకా, ముందు ఎవ్వరూ లేని అనాథ -


అందరూ వెళ్ళిపోయాక అతడు మునిని దర్శించుకున్నాడు - ముని ఆశీర్వదించి “నీ కష్టం ఏమిటి నాయనా?” అంటూ అడిగాడు"స్వామీ! నాకు ఒక కుటుంబం కావాలి. నాకు వెనకా ముందు ఎవరూ లేరు. ఆస్తిపాస్తులు లేవు. అందుకని ఎవ్వరూ నాకు పిల్లనివ్వటానికి ముందుకు రావట్లేదు” అంటూ బావురుమన్నాడు-


ముని గోవిందుడిని ఊరడించి “నీకు బాగా వచ్చిన విద్య ఏమిటి?” అంటూ అడిగాడు-


“నాకు ఏ విద్య రాదు స్వామీ”


"సరే! నీకు ధనంకావాలా? బుద్ధి బలం కావాలా?”


గోవిందుడు ఒక్క నిమిషం ఆలోచించాడు.


అప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి పిల్లనిస్తారు అందుకని వాడు ధనమే కావాలన్నాడు.


ముని చిరునవ్వు నవ్వి “నాయనా మరొక్కసారి ఆలోచించుకో బుద్ధిబలంతో ఈ లోకంలో ఎన్నో సాధించవచ్చు. ధనంతో మాత్రం కొన్ని మాత్రమే సాధించగలం” అంటూ నచ్చచెప్పబోయాడు-


గోవిందుడు పట్టువిడవలేదు-


తనకి ధనమే కావాలన్నాడు -


ముని అతడితో సరేనని ఓ మంత్రం చెవిలో చెప్పి “నాయనా! నీవు ఈ ఊరు వదిలి వేరే చోటుకు పోయి ఈ మంత్రం పఠించి కోరినంత ధనం పొందు. ఈ మంత్రం నీకు మూడు సార్లు మాత్రమే ఉపయోగపడుతుంది” అని చెప్పాడు.


గోవిందు ఆనందంగా ఆ రాత్రే ఆ గ్రామం వదిలి మరో గ్రామానికి బయలుదేరాడు-


తెల్లవారేసరికి అతను అడవి ప్రాంతాన్ని చేరుకున్నాడు-


ఆ సమయంలో వాడికి ముని చెప్పిన మంత్రం ఫలిస్తుందో లేదో చూడాలన్న కోరిక కలిగింది -


వెంటనే ఒక చోట కూర్చుని మంత్రం పఠించి బస్తాడు బంగారు వరహాలు కావాలని కోరుకున్నాడు -


మరుక్షణం


వాడి ముందు బస్తాడు బంగారు నాణాలు ప్రత్యక్ష మయ్యాయి-


ఉన్నాయి అవి చాలా బరువుగా


ధనం విలువ వాడికి తెలుసు. అదుంటే తను గొప్పవాడై పోతాడు.


వాటిని భుజానికెత్తుకో వటం వాడి వల్ల కాలేదు-


ఆ అడవిలో ఓ బంది పోటు దొంగల స్థావరం ఉంది. వాళ్ళు ఆ రాత్రి పొరుగు గ్రామంలో ఉన్న ధనవంతుడి ఇంటికి దోపిడీ కని వెళ్ళారు. కానీ ఆ ధనవంతుడు చనిపో వటం ఊరి ప్రజంతా ఆ ఇంటి ముందే గుమ్మి గూడటంతో వట్టి చేతుల్తో తిరిగి వస్తున్నారు


గుర్రాల మీద వస్తున్న దొంగల్ని గమనించి వారిని ఆపి కొంచెం ఆ వరహాల మూటతో తనను గుర్రంపై అడవిని దాటిస్తే వారికి కొన్ని వరహాలను ఇస్తానన్నాడు గోవిందుడు-


దొంగల నాయకుడు గోవిందుడి మాటలు నమ్మలేదు


మూట విప్పి చూపించాడు గోవిందుడు-


దొంగల నాయకుడు తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు“సరే! సాయం చేస్తాను గానీ అసలు నువ్వెవరు ఈ వరహాల మూట


ఎక్కడిది. ఎక్కడకు తీసుకుపోతున్నావు” అంటూ అడిగాడానాయకుడుగోవిందుడు జరిగిందంతా చెప్పాడు-


వాడొట్టి అమాయకుడని దొంగల నాయకుడికి అర్థమయ్యి వరహాల మూటతో పాటుగా గోవిందుడిని కూడా తమతో పాటు తమ స్థావరానికి తీసుకుపోయి కాళ్ళు చేతులు కట్టి బంధించాడు-


"ఎందుకు నన్ను బంధించారు?" అంటూ అడిగాడు గోవిందుడు దొంగల నాయకుడిని -


అందుకా నాయకుడు నవ్వి “నువ్వు చెప్పిన కట్టు కథను నమ్మానను కుంటున్నావా? మాకు తెలుసు నువ్వు రాజుగారి వేగువి. మా స్థావరం తెలుసుకోవటానికే ముని, మంత్రం అంటూ నాటకం ఆడుతున్నావు. చెప్పు నిజం చెప్పు” అంటూ కొరడాతో వాడి వంటి మీద కావాలనే రెండు దెబ్బలు వేసాడు-


గోవిందుడు బాధతో గావు కేకలు పెడుతూ "అయ్యా! కొట్టకండి నేను నిజమే చెబుతున్నాను. కావాలంటే ఆ వరహాల మూటను మీరే తీసుకుని నన్ను వదిలెయ్యండి. నా దారిన నేను పోతాను” అంటూ బ్రతిమాలుకున్నాడు –


అసలు దొంగల నాయకుడు గోవిందుడిని ఎత్తుకు వచ్చింది వరహాల మూట కోసమే.


దానితో పాటు వాడు చెప్పింది నిజమైతే మిగతా రెండు సార్లు కూడా వాడి చేత ఆ మంత్రం చదివించి మరిన్ని కాసుల మూటలను


సంపాదిస్తే ఇక బ్రతికినంత కాలము ఈ దొంగ జీవితం వదిలేసి అందరిలా దర్జాగా బ్రతకవచ్చు అన్నది వాడి ఆలోచన


గోవిందుడు కొంతసేపు బ్రతిమిలాడాక దొంగల నాయకుడు వాడి పట్ల కాస్తంత జాలి కలిగినట్లు నటిస్తూ-


“సరే! నువ్వు చెప్పింది నిజం అని నమ్మి నిన్ను విడిచి పెట్టాలంటే నువ్వు మరోసారి మంత్రం చదివి ఇక్కడ కొంత సేపు బంగారు వరహాల వాన కురవమని కోరుకో” అన్నాడు


గోవిందుడు అలా చేస్తే తనని వాళ్ళు వదిలేస్తారు కదా అని వెనకా ముందు ఆలోచించుకోకుండా మంత్రం చదివి దొంగల నాయకుడు చెప్పినట్లే కోరుకున్నాడు


మరుక్షణం-


దొంగల స్థావరంలో కొంతసేపు ఆగకుండా కాసుల వర్షం కురిసింది -


ఆ కాసులన్నింటిని ఆ నాయకుడు మూటల్లోకి ఎత్తించి గోవిందుడిని బెదిరించి మరోసారి అలానే కోరుకొమ్మన్నాడు-


ప్రాణాల మీద ఆశతో దొంగల నాయకుడు చెప్పినట్లే చెయ్యక తప్పలేదు గోవిందుడికి-


ఈ సారి కురిసిన వరహాలను మూటల్లోకి ఎత్తించినాక దొంగల నాయకుడు అతడిని చంపకుండా కళ్ళకు గంతలు కట్టి అడవి మధ్యలో వదిలిపెట్టాడు.


గోవిందుడు నానాతిప్పలు పడి తిరిగి తన గ్రామం చేరుకుని మునిని


కలిసి జరిగిందంతా చెప్పి మరోసారి ఆ మంత్రం ఉపదేశించమన్నాడు- ముని అందుకు తిరస్కరిస్తూ “బుద్ధిబలం లేనివాడి దగ్గర ధనం ఇలాగే పరుల సొంతం అవుతుంది. నీకు ఎన్నిసార్లు ఆ మంత్రం ఉపదేశించినా దాని వల్ల లభించే ధనం కాపాడుకునే తెలివి తేటలు నీకు లేవు" అన్నాడు


గోవిందుడు తన తప్పు తెలుసుకుని అయితే ఈ సారి బుద్ధిబలాన్ని ప్రసాదించమని మునిని వేడుకున్నాడు-


ముని అందుకు అంగీకరించి, అతనికి బుద్ధి బలాన్ని ప్రసాదించే మంత్రోపదేశం చేసాడు-


ఆ తర్వాత గోవిందు బుద్ధి బలంతో త్వరలోనే గొప్ప ధనవంతుడయ్యి తగిన కన్యను వివాహం చేసుకుని తను కోరుకున్నట్లుగానే కుటుంబీకు డయ్యాడు.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్