మంద బుద్ధి కుందేళ్ళు | Moral Stories in Telugu

 ఒక అడవిలో అందాల సరస్సు ఉండేదిఆ సరస్సులో కొన్ని తాబేళ్ళు ఉండేవి -


ఒడ్డున ఉన్న పొదల్లోకి ఓ రెండు కుందేళ్ళు వచ్చి చేరాయికుందేళ్ళకి తాబేళ్ళకి మధ్యన స్నేహం కుదిరింది -


రోజు సాయింత్రం పూట తాబేళ్ళు ఒడ్డుపైకి వచ్చి కొంతసేపు కుందేళ్ళతో ముచ్చట్లు చెప్పుకుని తిరిగి తాబేళ్ళు తమ ఇళ్ళకు వెళ్ళేవి-


ఒక సాయింత్రం కుందేళ్ళు తాబేళ్ళతో ఇలా అన్నాయి -


"మిత్రులారా! ఇక్కడకు దగ్గర్లో మరొక సరస్సు ఉంది. అందులో నీరు ఇక్కడ కంటే ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. అక్కడ పచ్చిక పొదలు కూడా ఇక్కడ కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయి.


అందుకని మేం తొందరలో అక్కడకి మారిపోదామని అనుకుంటున్నాము. మిమ్మల్ని విడిచి వెళ్ళాలంటే బాధగా ఉంది. అందువల్ల మీరు కూడా మాతో వస్తే ఎంతో బావుంటుంది.”


ఆ మాటలకు తాబేళ్ళల్లో పెద్దది ఇలా అంది-


"మిత్రులారా! మీరు చెప్పింది బానే ఉంది. కానీ ఇది అలవాటు అయిన చోటు. పైగా సురక్షితం కూడా. ఇక్కడకు ఏ కూర జంతువులు


రావు. కనుక మాకు, మీకు ఎటువంటి ప్రాణ భయం లేదు. ఇటువంటి చోటును వదులుకుని మనం మరో క్రొత్త చోటుకు వెళ్ళటం ఎందుకు?” ఆ మాటలు మిగతా తాబేళ్ళకు నచ్చాయి. కానీ కుందేళ్ళు మాత్రం


అందుకు ఒప్పుకోక తిరిగి ఈ విధంగా అన్నాయి -


"మిత్రులారా! మనం ఎంతో కాలం నుండి కలిసి ఉంటున్నాం కదా. అందుకే అలా చెప్పాం సరే మీకిష్టం లేకపోతే రావద్దు. మీరు ఇక్కడే ఉండండి.


మేము మాత్రం అక్కడికి వెడతాం. కొన్నాళ్ళు పోయాక అక్కడి పరిస్థితులు మీకు చెబుతాం. అప్పుడు మీకు నచ్చితే వద్దురుగాని”


ఆ మాటలకు ఇష్టంలేక పోయినా “సరే” అన్నాయి తాబేళ్ళుఆనాడే కుందేళ్ళు ఆ చోటు విడిచి కొత్త చోటుకు వెళ్ళిపోయాయి ఆ సరస్సు మంచినీటి సరస్సు కావటం వల్ల అక్కడకి దాహం


తీర్చుకోవటానికి సాధు జంతువుల్తో పాటు కూరజంతువులు కూడా వచ్చేవి-


కొంత కాలానికి ఆ రెండు కుందేళ్ళకి ఓ పెద్ద పులితో స్నేహం కుదిరింది. ఆ విషయం ఆనందంగా వచ్చి తాబేళ్ళకు చెప్పాయి. అది విన్న తాబేళ్ళలో పెద్ద తాబేలు ఈ విధంగా చెప్పింది -


"మిత్రులారా! మనలాంటి సాధు జంతువులకు కూృరజంతువులతో స్నేహం ఏనాటికైనా ప్రాణాలకు ముప్పును తెస్తుంది. ఆగర్భశత్రువును మిత్రుడిగా భావించటం మూర్ఖత్వమే అవుతుంది.


ఆ పులి ఏదో దుష్ట ఆలోచనతోనే మీతో స్నేహం నటిస్తోంది అని నాకు అన్పిస్తోంది. అందుకని మీరు తిరిగి అక్కడకు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోండి. అదే మీకు క్షేమం.”


ఆ తాబేలు మాటలు కుందేళ్ళకు రుచించలేదు. తిరిగి తాబేలుకు ఇలా సమాధానము చెప్పాయి -


"మిత్రమా! నీది ఒట్టి భయం. బలవంతుడితో స్నేహము ఎప్పటికైనా ప్రయోజనమే. పైగా ఆ పులి ఈ ప్రాంతమంతటికి రాజు. అటువంటి వాడితో స్నేహంగా ఉండటం వల్ల ఇతర కూౄర జంతువులు మా జోలికి రావటానికి సంశయిస్తాయి. భయపతాయి.”


వాటి మాటలు విన్న తాబేలు ఎంతో నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది.


లిచ్చాయి అయినా కుందేళ్ళు చెవికెక్కించుకోక పెడసరంగా సమాధానా


చివరికి వాటి ఖర్మ అనుకుని తాబేలు మౌనం వహించింది-


కుందేళ్ళు వెళ్ళిపోయాక ఆ తాబేలు మిగతావాటితో ఈ విధంగా చెప్పింది


"మిత్రులారా! మంద బుద్ధి గల రాజు వల్ల రాజ్యానికి నష్టం కలుగుతుంది. మంద బుద్ధి గల స్నేహితుడి వల్ల అతడి స్నేహితులకు నష్టం కలుగుతుంది.


మన కుందేళ్ళ మిత్రులిద్దరూ మంద బుద్ధి కలవారు... ముందు చూపు ఏ మాత్రం లేని ముర్ఖులు. వీరి వల్ల మనకి ముందు, ముందు ఏదన్నా ఆపద కలగవచ్చునని నాకు తోస్తున్నది. మనం వెంటనే ఈ చోటు వదిలి మరో చోటికి పోదాం.”


ఆ మాటలు మిగతా తాబేళ్ళకు నచ్చాయి -


అందరిలోకి పెద్దది ఆ మాటలు చెప్పిన తాబేలు అది ఎంతో ముందు చూపు కలిగింది పైగా ఎంతో అనుభవం కలిగింది.


అందుకని దాని మాటకు ఎదురు చెప్పటంకంటే ఆచరించటం ఉత్తమం అనుకున్నాయి-


“ఎక్కడకి వెడదాం” ధైర్యం చేసి ఓ తాబేలు అడిగింది -


వెడదాం" “ఆ కుందేళ్ళు తూర్పు వైపు వెళ్ళాయి కదా. మనం పడమర వైపు


"అటువైపు సరస్సు ఉండాలి కదా!" అంది మరో తాబేలు“ఇక్కడే ఉండి ప్రమాదం కొనితెచ్చుకొనేకంటే దేవుడి మీద భారం


వేసి ముందుకు పోవటమే ఉత్తమం.”


“సరే!” నని అన్నీ అంగీకరించాయి -


మళ్ళీ పెద్ద తాబేలు ఈ విధంగా చెప్పింది -


“ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. పైగా రాత్రి పూట కూర జంతువుల అలికిడి కూడా తక్కువగా ఉంటుంది.


అందుకని మనం ఈ క్షణం నుండి రాత్రి పూట ప్రయాణిస్తూ పగటి పూట సురక్షిత ప్రాంతాలలో విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెడదాం.” మళ్ళీ అన్నీ సరేనన్నాయి -


తాబేళ్ళన్నీ అప్పటికప్పుడు ఆ ప్రాంతం వదిలి వేరే సరస్సును అన్వేషిస్తూ పడమర వైపుగా బయలుదేరాయి-


తాబేళ్ళు ఆ ప్రాంతం వదిలిన రెండో రోజు పెద్ద పులి కుందేళ్ళతో ముచ్చట్లాడుతూ...


"మిత్రులారా! మీకు మాకు స్నేహం కుదిరి చాలా కాలమయ్యింది కదా ఇంత కాలమైనా మీ ఇంటికి నన్ను విందుకు పిలవలేదు” అంటూ అడిగింది -


"భలేవాడివి మిత్రమా రేపేరా!” అంటూ ఆహ్వానించాయి కుందేళ్ళుమర్నాడు విందుకు వచ్చింది పెద్దపులి రుచికరమైన విందు పెట్టాయి కుందేళ్ళు-


విందారగించిన కొంత సేపటికి కుప్పకూలి పోయింది పెద్ద పులి కుందేళ్ళు కంగారుపడుతూ వెళ్ళి పులికి బంటులా ఉండే నక్కకు ఈ సంగతి చెప్పాయి.


నక్క కుందేళ్ళకు ధైర్యం చెప్పి కంగారు పడకండి అంటూ కుందేళ్ళ వెంట వచ్చి పెద్దపులిని పరీక్షించి "అయ్యో! పెద్ద ప్రమాదం ముంచు


కొచ్చింది. పుట్టినప్పటి నుండి మాంసాహారం తప్ప శాఖాహారం తినక పోవటం వల్ల పులికి ఈ దుర్గతి పట్టింది. దీనకి ఒకటే మార్గం. రేపటిలోగా తాబేలు మాంసం దీని కడుపులోకి చేరితేగానీ ఇది బ్రతకదు” అంటూ పెదవి విరిచింది-


నిజానికి కుందేళ్ళు తాబేళ్ళు ఉంటున్న సరస్సు ఒడ్డు నుండి మంచినీటి సరస్సు దగ్గరకు వచ్చాయన్న సమాచారం ఎలాగో నక్కకి తెలిసింది. దానికి తాబేళ్ళ మాంసం రుచి చూడాలనిపించింది. అందుకని తాబేలు మాంసం రుచి గురించి పెద్ద పులికి కథలు, కథలుగా చెప్పి నీళ్ళల్లో ఉండేవాటిని వేటాడటం కష్టం కనుక కుందేళ్ళతో స్నేహం నటించి తాబేళ్ళను కుందేళ్ళ ద్వారా నీటిలోంచి బయటకు రప్పించి చంపి తినాలన్నది దాని పన్నాగమే.


నక్క పథకంలో భాగంగానే పెద్ద పులి కుందేళ్ళను విందు అడిగి మరీ అవి పెట్టినవి ముక్కు మూసుకుతిని జబ్బు చేసినట్లు నటించింది-


“అయ్యో! ఇప్పుడెలా... రేపటి లోగా తాబేలు మాంసం అంటే కష్టం కదా” అంటూ నక్క ముందువాపోయాయి కుందేళ్ళు-


“రేపటిలోగా పెట్టకపోతే పులి ప్రాణం పోతుంది. ఆ పాపం మీకే చుట్టుకుంటుంది” అంటూ వాటిని బెదిరించింది నక్క-


కుందేళ్ళకు ఏం చెయ్యాలో పాలుపోలేదు... ఎంతయినా తాబేళ్ళు వాటికి పాత మిత్రులు అటువంటి వాటికి హాని తలపెట్టటానికి మనస్క రించలేదు. అలాగని చూస్తూ, చూస్తూ తమ వల్ల పెద్ద పులి ప్రాణాలను పోగొట్టుకోవటం వాటికి ఇష్టం లేకపోయింది -


"ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు. వెళ్ళండి ఎక్కడో ఒక చోట ఒక తాబేలును వేటాడి పట్టుకురండి" అంటూ హుంకరించింది నక్క-


"అయ్యో! నక్క మిత్రమా! అదెలా సాధ్యం తాబేళ్ళు నీళ్ళలో కదా ఉంటాయి” అన్నాయి కుందేళ్ళు.


“ఏం మీకు తాబేళ్ళు స్నేహితులే కదా... విందుకు రమ్మని పిలవండి. వచ్చాక చంపి పులికి పడదాం" అంటూ ఉచిత సలహా ఇచ్చింది నక్క-


అనుకున్నంతా అయ్యింది. ఈ నక్కకి తమకి తాబేళ్ళకి మధ్యన ఉన్న స్నేహం గురించి తెలిసిపోయినట్లుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచనలో పడ్డాయి కుందేళ్ళు-


“ఏమిటి ఆలోచిస్తున్నారు... ఆలస్యం చేసిన కొద్ది పులి ప్రాణాలకి ప్రమాదం. పులి గాని మరణించిందంటే ఈ అడవిలో ఉన్న మిగతా జంతువులు ఊరుకోవు. మిమ్మల్ని చంపేస్తాయి” అంటూ కుందేళ్ళను భయపెట్టే ప్రయత్నం చేసింది నక్క-


చచ్చిపోయినట్లు శవాసనం వేసిన పులి ఈ మాటలన్ని శ్రద్ధగా ఆలకిస్తోంది -


కుందేళ్ళు బిక్కచచ్చిపోయాయి-


ఒక ప్రక్క మిత్రదోహం మరో ప్రక్క ప్రాణదానం ఏం చెయ్యాలో అర్థం కాక ఒక్క క్షణం వాటికి ఏడుపు ముంచుకొచ్చింది. మనసులో ఇలా అనుకున్నాయి-


"అయ్యో! కూరజంతువులతో స్నేహం ఏనాటికైనా ప్రాణాలకు ముప్పు తెస్తుందని ఆనాడు తాబేలు పెద్ద ఎంతో ముందు చూపుతో చెప్పిన మాటలను పెడ చెవిన పెట్టినందుకే కదా ఈ దుస్థితి దాపురించింది.


కుందేళ్ళు కదలక మెదలక ఉండటంతో కుందేళ్ళతో నక్క "భయపడకండి కావాలంటే తాబేళ్ళకు సంగతి చెప్పకుండా మీ తరుఫున విందుకు నేను ఆహ్వానిస్తాను. నా వెంట వచ్చి ఆ తాబేళ్ళు ఉండే సరస్సును చూపించండి" అంటూ తొందర చేసింది-


“సరే... ముందు ఇక్కడ్నుంచి బయటపడితే మిగతాది అప్పుడు ఆలోచించుకోవచ్చు” అనుకుని నక్క వెంట తాబేళ్ళు అంతకు ముందు ఉన్న సరస్సు దగ్గరకు చేరుకున్నాయి -


"పిలవండి... పిలవండి...” అంది నక్క ఉత్సాహంగా-


దానికి ఎప్పుడెప్పుడు తాబేలు మాంసం రుచిచూస్తానా? అని ఆరాటంగా ఉంది-


కుందేళ్ళు ఒక దానికొకటి సైగలు చేసుకున్నాయి. ఆ తర్వాత ఒక కుందేలు "తొందర పడకు నక్క బావా! ఈ సమయంలో మా తాబేళ్ళ మిత్రులు మంచి నిద్రలో ఉంటారు.


నువ్విక్కడే ఉండు మేం వెళ్ళి పిలుచుకు వస్తాం...” అంటూ క్షణం కూడా ఆలోచన చెయ్యకుండా ఆ రెండు కుందేళ్ళు మిత్రదోహం చెయ్యలేక అలా చెయ్యకపోతే కూౄరమృగాలకు బలికావలసి వస్తుందని నీళ్ళలోకి దూకి ప్రాణత్యాగం చేసాయి -


ఆ విషయం ఆలస్యంగా అర్థమయ్యింది నక్క బావకి ఊస్సూరుమంటూ వెళ్ళి పులికి ఆ విషయం చెప్పింది- పులికి నక్క మాటల మీద నమ్మకం కుదరలేదు. తాబేళ్ళనూ, కుందేళ్ళనూ నక్కే చంపితినేసి తనకి కట్టు కథలు చెబుతోందనుకుని కోపంతో నక్కను చంపేసింది–


ముందు చూపులేకుండా మంచి, చెడు మరచి ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తే ఇటువంటి ప్రమాదాలే ఎదురవుతాయి.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్