మాట తప్పని ఆవు | Moral Stories in Telugu

 ఒక గ్రామంలో శరభయ్య అనే రైతు ఉండేవాడుఅతడి గొడ్లసావిట్లో ఒక ఆవు ఉండేది. అదంటే శరభయ్య కూతురికి ఎంతో ఇష్టం


శరభయ్య ప్రతిరోజు తన ఎడ్ల జతతో పాటు ఆవును కూడా కొండల దగ్గర ఉన్న తన పొలంకి తోలుకు పోయేవాడు. పని అయిపోగానే ఎడ్లను, ఆవును కొండల దగ్గర ఉన్న పచ్చికను మెయ్యటానికి వదిలి తను ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుని సాయంత్రం పొద్దు పొడవకముందే వాటిని ఇంటికి తోలుకువచ్చేవాడు-


కొన్నాళ్ళకు ఆవుకు ఒక లేగ దూడ పుట్టింది-


ఆ దూడను చూసి శరభయ్య కూతురు ఎంతగానో మురిసిపోయి ఆవును మేతకు తండ్రి తీసుకుపోయిన సమయమంతా దూడ ఆలనా, పాలనా తానే స్వయంగా చూస్తుండేది-


ఒకనాడు శరభయ్య పొలం పని అయిపోయినాక ఎడ్ల జతతో పాటుగా ఆవును కూడా మేతకు వదిలాడు -


ఆ కొండలకు దగ్గరలో ఒక పెద్ద అడవి ఉంది -


ఆ అడవిలో కూౄర జంతువులు ఉండేవి -


ఆ అడవికి రాజు ప్రసేనుడనే పెద్ద పులి -


ఆ పులి ఎంతో బలిష్టంగా ఉండటమే కాక చాలా కూౄరమైనది. ఆ


అడవిలో మదగజాలు కూడా దాని వైపు చూడటానికి భయపడిపోయేవి- ఎడ్లతో పాటుగా మేస్తున్న ఆవు ఏమరుపాటుగా ఆ అడవి దాపులకు వచ్చేసింది. కొంత సమయం తర్వాత ఆ విషయం గమనించగానే దాని గుండెలు దడ దడలాడాయి. అది అంతకు ముందు ప్రసేనుడి గురించి, దాని కూౄరత్వం గురించి విని ఉంది -


అదురుతున్న గుండెల్లో ధైర్యం తెచ్చుకుని గబ గబా పొలందారి పట్టిందది


కొద్ది దూరం నడిచిందో లేదో అనుకున్నట్లుగా పెద్ద పులి దారికి అడ్డంగా వచ్చేసి నిల్చుంది-


పులిని చూడగానే ఆ ఆవుకు ధైర్యం దిగ జారిపోయింది -


పై ప్రాణాలు పైనే పోయాయి-


కాస్తంత లేని ధైర్యం తెచ్చుకుని "మిత్రమా! ఎందుకు నా దారికి అడ్డంగా నిల్చున్నావు?" అంటూ ప్రశ్నించింది-


పులి పగలబడి నవ్వుతూ....


"ఈ మాత్రం నీవు తెలియదా. నీ మాంసం నాకు ఆహారముగా తగినది. పైగా ఆకలితో ఉన్నాను. కనుక నిన్ను చంపితింటాను” అంటూ ఆ ఆవుకు బదులిచ్చింది-


"మిత్రమా! నీ మాటలు సత్యము కాదనను. కానీ నాదొక చిన్న విన్నపం" అంది ఆవు ఎంతో వినయంగా-


నోటికి దొరికిన ఆహారం-


వేగంగా పరిగెత్తెలేని జంతువు-


అన్నిటికంటే తనపట్ల ఆవు చూపించిన వినయం పులికి నచ్చింది“సరే! విన్నవించుకో” అంది గంభీరంగా-


"మిత్రమా! నేను ఒంటరి దానిని కాదు. నా కోసం ఎదురు చూసే ఒక లేగ దూడ కాచుకు కూర్చుని ఉంటుంది. ఇంటికి చేరగానే “అంబా” అంటూ నా పొదుగును చేరుకుని ఆకలి తీర్చుకుంటుంది. అందుకని... "...అందుకని...”


నీ “నాకు కొంచెం గడువివ్వు. నా బిడ్డ ఆకలిని తీర్చి తిరిగి నీ దగ్గరకు వస్తాను.”


ఆవు మాటలకు పులి పగలబడి నవ్వి ఇలా అంది“భేష్... తప్పించుకుపోవటానికి భలే ఎత్తును వేసావు. కానీ


నువ్వునుకుంటున్నట్లు నేను తెలివి తేటలు లేని ముర్ఖుడినికాదు.” పులి మాటలకు ఆవు మోకరిల్లి ఇలా అంది-


"మిత్రమా! నన్ను నమ్ము నేను మాట తప్పి ప్రవర్తించు నీచురాలిని కాదు. నాకు కొంత సమయం చాలు. నా మాట మీద నీకు నమ్మకం


లేకపోతే నా వెంట నీవు కూడా రా. నా బిడ్డ ఆకలిని తీర్చిన మరుక్షణం నీకు ఆహారమవుతాను.”


"ఆహాఁ! ఏదో అనుకున్నాను. గొప్ప జిత్తులమారి దానివే... నీ వెంట నేను వస్తే నీ యజమాని చేత నాకు దేహ శుద్ధి చేయించాలని భలే పన్నాగం పన్నావు.


అయినా నా ఎదుట ఆహారాన్ని పెట్టుకుని ఇంతసేపు వ్యర్ధప్రసంగం చేయటం నేను చేస్తున్న తెలివి తక్కువ పని” అంటూ ఆవును చంపటానికి ముందుకు ఉరకబోయింది-


ఆవు కంగారు పడిపోతూ "మిత్రమా! ఒక్క క్షణం” అంది పులి ఠక్కున ఆగిపోయి 'ఏమిటి?' అంది -


"మిత్రమా దయుంచి ఒక్కసారి నా మాట విను. నేను మాట తప్పను. మాట తప్పినవారు బ్రతికున్నా మరణించినట్లే. అంత దుర్భరమైన జీవితం అనుభవించేటటువంటి దానిని కాను.


"యుద్ధమందు భయము... వేటనందు జాలి... విద్య యందు నిర్లక్ష్యము... మాట నందు భంగపాటు ఉండరాదు అన్నారు పెద్దలు. నేను నీతో యుద్ధమునకు సిద్ధముగా లేను. కనుక భయంతో నీకు దాసోహ మంటున్నాను. నీకు నన్ను వేటాడే అవసరం లేకుండానే దొరికాను. కనుక నాపై నీవు జాలి చూపించవచ్చును. పెద్దలు చెప్పినవన్నీ విద్యయే కనుక ఆ మాటలను ఎప్పుడూ పెడ చెవిన పెట్టరాదు. నేను సత్యవంతురాలిని, ధర్మరాజు అంశ కలదానిని, నా నోటి నుండి వచ్చు ఏ ఒక్క చిన్న మాటకూ నేను భంగం కల్గించను.”


“నేను దైవభక్తురాలిని. ఆ దేవుడు నాకు ఆయువు ఈ క్షణం వరకే ఇస్తే నీవు నన్ను చంపుకుతిను” అంటూ నేలపై సాష్టాంగపడింది ఆవు.


పులి మనసు కరిగింది-


ఈ ఆవు సత్యవంతురాలు అని దాని చెవులలో ఎవరో అరచినట్లుగా భ్రమ కలిగింది-


పులి ఆవును విడిచి పెడుతూ ఈ విధంగా చెప్పింది-


“నీవు కోరినట్లే నీకు కొంత సమయం గడువు ఇస్తాను. కానీ నీవు తిరిగి వెళ్ళిన తరువాత నీ యజమాని నిన్ను రానిస్తాడా? అతను రానిచ్చినా చచ్చిపోయే ముందు కూడా నీ బిడ్డ ఆకలిని తీర్చాలని తాపత్రయ పడుతున్నావే అటువంటి నీవు నీ కన్న బిడ్డను వదిలి నాకు ఆహారం కావటానికి రాగలవా?”


ఆ మాటలకు ఆవు పులికి ఈ విధంగా బదులిచ్చింది -


"మిత్రమా! పూర్వం నుండి ఆడిన మాట తప్పని ఎందరికో మేలే జరిగింది. ఆ భగవంతుడు నన్ను నీకు ఆహారం కావటానికే పుట్టించి ఉంటే అది తప్పకుండా జరిగే తీరుతుంది. దానికి భిన్నంగా నేను ఎంత ప్రయత్నించినా జరగదు.


ఆ భగవంతుడి మాటను ధిక్కరించి మనుగడసాగించటం ఎవ్వరికీ సాధ్యం కాదు. కనుక నీవు సందేహించకు. నాకు కొద్ది సమయం ఇప్పించు. నేను వెళ్ళి నా బిడ్డ ఆకలిని తీర్చి వేగిరంగా తిరిగి వస్తాను”


నంది- ఆ మాటలకు పులికి ఆవు మీద పూర్తిగా విశ్వాసం కుదిరి సరే


ఆవు పులికి కృతజ్ఞతలు తెలుపుకుని మిగిలిన ఎడ్లజతను కలుసుకుని ఇంటికి చేరుకుని తన లేగ దూడ ఆకలిని తీర్చి దానితో ఈ విధంగా చెప్పింది


"అమ్మా! ఇప్పుడు నీకు నీతి కొంత చెబుతాను శ్రద్ధగా విను.... ఎప్పుడూ ఏమరుపాటుగా ఉండద్దు. యజమానికి విశ్వాసంగా ఉండాలి. సేవకుల పట్ల ప్రేమగా ఉండాలి. పౌరుషం ఉండాలి. ఆవేశం, అహంకారం కూడదు. సత్యమును ఆచరించాలి. అసత్యమును దూరంగా తరమాలి. ఆదరించిన వారిని గౌరవించాలి. నమ్మినవారికి వెన్నుకాయాలి. ఎదుటి వారి పట్ల చిన్నచూపు తగరాదు.


అపకారికి కూడా ఉపకారమే తలవాలి. ఇతరుల పట్ల చులకన భావము తగదు. ఎప్పుడు స్థానబలం మర్చిపోకు. నీ జతగాళ్ళను వదిలి నీ


ఒంటరిగా సంచరించకు. ఇతరుల పట్ల ప్రేమ, జాలి, దయ, దేవుని పట్ల నమ్మకము విడిచి పెట్టకు.... అంటూ ఎన్నో రకాలుగా నీతి బోధలు చేసి తిరిగి పులి దగ్గరకు బయలు దేరింది ఆ ఆవు-


కొంత సమయం గడిచేసరికి ఆవు తిరిగి రాకపోవటం చూసి పులికి దాని మీద నమ్మకం పోయి అయ్యో! నోటికి దొరికిన ఆహారాన్ని విడుచుకున్న నేను ఎంత ముర్ఖురాలిని అని తనని తాను తిట్టుకుని అయినా ఆశ చావక మరికొంత సేపు వేచి చూద్దాం అనుకుని ఆవు కోసం ఎదురు చూడసాగింది-


వడి,వడిగా నడుచుకుంటూ పులి దగ్గరకు చేరుకున్న ఆవు “క్షమించు మిత్రమా! కడసారిగా నా బిడ్డకు హితబోధ చేస్తూ కొంత ఆలస్యం అయ్యింది. ఇప్పుడు నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో" అంది -


పులికి ఆశ్చర్యం కల్గింది -


“మిత్రమా” అంది ఎంతో మృదువుగా


"ఏం మిత్రమా! సందేహించకు నన్ను చంపుకు తిను”


"వద్దు మిత్రమా! వద్దు నీవంటి దానిని చంపి జన్మ, జన్మలకు పాపమును మూటకట్టుకొనలేను. అయినా నాదొక సందేహం తీరుస్తావా” అంది పులి-


“అడుగు మిత్రమా!”


“నీవు తిరిగి వస్తే నేను నిన్ను చంపుకుతింటానని నీవు తెలుసు. తప్పించుకునే అవకాశం నీకు దక్కినా తిరిగి మళ్ళీ నీవు మరణాన్ని కోరుకుని నా దగ్గరకు ఎందుకు వచ్చావు. నేను కూౄర జంతువుని. నీలాంటి ఎన్నో సాధుజంతువుల ఉసురు పోసుకున్నవాడిని. నావంటి వానికి ఇచ్చిన మాటను తప్పినా నీకు ఏ దోషము అంటదు కదా” అంటూ తన సందేహం బయట పెట్టింది-


"మిత్రమా! నీకు నేను ముందే చెప్పాను. ఈ లోకంలో ఎవ్వరైనా మాట తప్పిన మరుక్షణం వారు మరణించినవారితో సమానం. మాట తప్పిబ్రతికి మరణించటము కంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని మరణించినా బ్రతికుండటమే ఉత్తమం" అంది.


ఆవు మాటలు విన్న పులి మనసు ద్రవించి పోయింది-


"మిత్రమా! నీ సత్యమే నీకు శ్రీరామరక్ష. నీ వంటి సత్యవంతుడి మనసును క్షోభ పెట్టాను. నన్ను క్షమించు. నేటి నుండి నేను కూడా నీ మార్గంలోనే పయనిస్తాను. నీ వంటి వాడి ఉసురుతీసి పాపం మూట కట్టుకోవటం కంటే నిన్ను మిత్రుడిగా మార్గదర్శకుడిగా పొందటమే నా వంటి వాడికి క్షేమం-లాభం" అంటూ పులి ఆవును చంపకుండా తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది-


తను నమ్మిన సత్యమే తన ప్రాణాలను కాపాడినందుకు ఆనందపడుతూ వడి, వడిగా ఇంటికి చేరి తన లేగ దూడను దగ్గరకు చేర్చుకుంది ఆవు.



కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్