వికటకవిగా రామకృష్ణ కవి - Tenali Ramakrishna

 తెనాలి రామకృష్ణ కవికి “వికటకవి" అనే మరోపేరు ఉండేది. ఇంతకూ ఈ పేరు ఎలా వచ్చింది ?

రామకృష్ణునికి చిన్ననాడే తండ్రి పోయారు. పెద్దగా వారికి ఆస్తిపాస్తులు లేవు. కనుక మేనమామ ఇంట పెరిగారు. తండ్రి లేనందున మేనమామ గారాబంగా పెంచారు. గారాబం కాస్త ఎక్కువైంది. రామకృష్ణునికి చదువుపై ధ్యాస పెరగలేదు. పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేసేవారు.

కాస్త పెద్దయ్యాక రామకృష్ణుడు సరిగా ఇంటిపట్టున ఉండటం మానేశారు. వేళకాని వేళల్లో రావడం, పెట్టింది తినడం. మరల 'బయటికి పోవడం, ఇలా అలవాటైపోయింది.

తరచు దేవాలయ మంటపంలో పడుకోవటం మామూలైపోయింది. దేవాలయంలో ఉండే ఒక

యోగి రామకృష్ణుని రోజూ చూస్తున్నారు. “రామకృష్ణా నీవు తెలివైనవాడిలా ఉన్నావు. చదువు సంధ్యలు మాని ఇలా తిరగడం బాగాలేదు. ప్రక్కనే గల చెరువులో స్నానం చేసిరా. నీకో | మంత్రోపదేశం చేస్తాను” అన్నారు యోగి. రామకృష్ణుడు అలాగే స్నానం చేసి వచ్చారు.

యోగికి ఎదురుగా బుద్ధిగా కూర్చున్నారు. “రామకృష్ణా నేనిపుడు మంత్రోపదేశం చేస్తున్నా. నీవు కాళికాలయానికి వెళ్ళి ఈ మంత్రం జపించు. కాళికాదేవి ప్రత్యక్షం అయ్యేవరకు జపించు. ఆ దేవి అనుగ్రహం పొందగలవు. నీకు శుభం కలుగు గాక !" అని దీవించారు.

యోగి చెప్పిన ప్రకారం రామకృష్ణ కవి కాళికాలయానికి వెళ్ళాడు. మంత్రం చదివాడు. కాళీమాతను ప్రార్థించాడు. కాళికాదేవి ప్రత్యక్షమైంది. రామకృష్ణుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. “అమ్మా కరుణించు” అని మొక్కాడు. కాళీమాత రెండు చేతులలో రెండు పాత్రలున్నాయి. ఇందు ఒక పాత్రలో పెరుగు, మరో పాత్రలో పాలూ ఉన్నాయి. ఈ రెంటిలో ఏది కావాలో కోరుకో ! ఇస్తాను" అంది మాత.

“అమ్మా - పాత్రలు రెండూ మీ వద్దే ఉంచుకొని ఏది కావాలో కోరుకో అంటే ఎలా ! | - రెండూ నాకిస్తే తాగుతాను" అన్నాడు రామకృష్ణ. ఏది రుచిగా ఉంటే - అ

“సరే” అని కాళికాదేవి రెండు పాత్రలను రామకృష్ణునికి అందించింది. రామకృష్ణుడు రెండు పాత్రలను అందుకున్నారు.

కాసేపు అటూ ఇటూ చూశాడు. తల గోక్కొని ఆలోచించాడు. ఏమీ తోచలేదు. అనాలోచితంగా రెండు పాత్రలలోని పెరుగూ, పాలూ తాగేశారు. అందుకు కాళికాదేవికి ఆగ్రహం కలిగింది. కన్నులెర్ర జేసింది. రామకృష్ణుడు ఈ విషయం గ్రహించారు. "జగన్మాతా! క్షమించు. నీవిచ్చిన రెండు పాత్రలలోని పదార్థాలూ రుచిగా ఉన్నాయి. అందుచేత రెంటినీ తాగేశాను. మన్నించు మాతా!” అని వేడుకున్నాడు రామకృష్ణుడు.

కాళీమాత కోపం కాస్త తగ్గింది.

తమాయించుకుంది. “నీవు వికటకవివి అగుగాక" అని శపించింది, కాళీమాత,

రామకృష్ణుడు వెంటనే "అమ్మా నా తప్పు మన్నించు. దారిద్య్రం నుంచి నన్ను కాపాడు. కనికరించు” అని ప్రార్థించాడు.

రామకృష్ణుని వినతిని కాళికాదేవి మన్నించింది.

“రామకృష్ణా నీవు వికటకవిగా రాజుల సన్మానం పొందుతావు. దారిద్య్రం నుంచి బయట పడతావు” అని అభయం ఇచ్చింది మాత. ఆ తరువాత అదృశ్యమైపోయింది. రామకృష్ణుడు 'క్రమంగా కవి అయినాడు.

తదుపరి వికటకవి అయినాడు. రాజాదరం పొందాడు. దారిద్య్రం నుంచి బయటపడ్డాడు. సుఖజీవనం చేశాడు.

అది ప్రచారంలో ఉన్న కథ. వాస్తవమో, కల్పితమో తెలియదు.

కొత్తది పాతది

సంప్రదింపు ఫారమ్